Top
Telugu Gateway

హోం క్వారంటైన్ లోకి ఎమ్మెల్సీ కవిత

హోం క్వారంటైన్ లోకి ఎమ్మెల్సీ కవిత
X

నిజామాబాద్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్ లోకి వెళ్ళారు. జగిత్యాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం నాడు ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను కలసి అభినందనలు తెలియజేశారు. ఆయనకు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ అని పలితం రావటంతో ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతే కాదు గత ఐదు రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతూ పోస్టు పెట్టారు.

విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ముందు జాగ్రత్త చర్యగా తాను వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండనని..ఎవరూ తనను కలిసేందుకు రావద్దని కోరారు. వాస్తవానికి కవిత బుధవారం నాడు జరిగే మండలి ఒక రోజు సమావేశంలో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. హోం ఐసోలేషన్ లో ఉండాలని కవిత నిర్ణయం తీసుకోవటంతో ప్రమాణ స్వీకారం మరో రోజుకు వాయిదాపడినట్లే అని చెబుతున్నారు.

Next Story
Share it