Telugu Gateway
Telangana

ఇరకాటంలో కెసిఆర్!

ఇరకాటంలో కెసిఆర్!
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేల ఎర కేసు లో రెండు సార్లు ఇరకాటంలో పడ్డారు. వ్యూహాత్మకంగా వీడియో రికార్డులు చేయించి..ఆధారాలు అన్నీ కోర్టుకి సమర్పించి విచారణ చేయించాల్సిన అయన ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయాలకు వాడు కోవాలని చూసి చిక్కుల్లో పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఇదే కేసు పై హై కోర్టు లో విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి బిఆర్ఎస్ అధినేత పేరుతో సి డీ లు ఇతర ఆధారాలతో తనకు ఒక కవర్ తనకు వచ్చింది అని...ఇతర రాష్ట్రానికి చెందిన హై కోర్టు జడ్జి కూడా తనకు ఫోన్ చేసి వీటిని ఏమి చేయాలని అడిగినట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం తరపున కోర్టు కు హాజరు అయిన న్యాయవాది హై కోర్టు కు క్షమాపణ చెప్పారు. ఒక పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ఒక కేసు కు సంబందించిన ఆధారాలు జడ్జి లకు నేరుగా పంపటం ఏ మాత్రం సమర్ధనీయం కాదు అని అధికారవర్గాలు చెపుతున్నాయి. ఇప్పుడు కేవలం సీఎం కెసిఆర్ ఈ కేసు కు సంబంధించిన ఆధారాలు అన్ని మీడియా తో పాటు ప్రజలకు బహిరంగం చేయటాన్ని హై కోర్టు తాజాగా తన తీర్పులో తప్పు పట్టింది. పలు అంశాలతో పాటు దీన్నికూడా ప్రస్తావించింది. సిట్ విచారణ నిష్పక్షపాతంగా సాగటంలేదు అనటానికి ఈ అంశాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు లేవనెత్తారు.

ఇలా రెండు సార్లు సీఎం కెసిఆర్ నిర్ణయాల వల్ల ఈ కేసు లో సర్కారు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది అని అధికారులు చెపుతున్నారు. ఎమ్మెల్యే ల కొనుగోలు ప్రయత్నాలను ఎవరూ సమర్ధించరు. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ భేటీకి ముందు జరిగిన విషయాలు ఏమిటి..బయటకు వచ్చిన విషయాలు అన్నీ నిజమేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో ఉంది. హై కోర్టు ఆదేశాలతో ఈ కేసు సిబిఐ చేతికి వెళితే ఇప్పటికే ఉన్న విషయాలు కాకుండా మరికొన్ని సంచలనాలు కూడా బయటకు రావొచ్చు అని చెపుతున్నారు. అదే సమయంలో సిబిఐ విచారణ పరిధిలోకి కెసిఆర్ చేతికి ఈ ఆధారాలు ఎలా వెళ్లాయనే అంశం కూడా కీలకంగా మారుతుంది అని...అదే సమయంలో కొంత మంది అధికారులకు కూడా చిక్కులు తప్పవనే చర్చ సాగుతోంది. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో వరసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా వేడి పెంచనున్నాయి. ఇప్పటికే ఇదే కేసు లో ఈడీ ఎంటర్ అయి విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిబిఐ కూడా వస్తే అంతా కేంద్ర ఏజెన్సీల చేతిలోకి వెళ్లినట్లు అవుతుంది. ప్రభుత్వం, సిట్ హై కోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లనుంది. అక్కడ కూడా ఊరట దక్కకపోతే సిబిఐ వెంటనే రంగంలోకి దిగటం ఖాయం.

Next Story
Share it