Telugu Gateway
Telangana

రేవంత్ పై మ‌ల్లారెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

రేవంత్ పై మ‌ల్లారెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు
X

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి ఆదివారం నాడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమ‌ర్శలు చేశారు. రేవంత్ ఒక లాఫుట్, చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చినవాడని, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడుతారా అంటూ విమ‌ర్శ‌లు చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని రూ. 50 కోట్లతో తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. సీఎం కేసీర్‌ను తిట్టడం ఏమిట‌న్నారు. ముఖ్యమంత్రిని తిట్టిన రేవంత్ పురుగులు పడి చస్తారన్నారు. జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొంతమంది కార్యకర్తలు టీఆర్ఎస్‌లోకి చేరారు. మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

Next Story
Share it