Telugu Gateway
Telangana

తెలంగాణలో విద్వేషపు విత్తనాలకు స్థానం లేదు

తెలంగాణలో విద్వేషపు విత్తనాలకు స్థానం లేదు
X

బిజెపి నల్లధనం తేలేదు..నల్ల చట్టాలు తెచ్చింది

తెలంగాణ నుంచి కేంద్రం తీసుకోవటమే తప్ప..రాష్ట్రానికి ఇస్తుంది ఏమీలేదని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ మండిపడ్డారు. బిజెపి నేత రావుల శ్రీధర్ రెడ్డి సోమవారం నాడు కెటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కెటీఆర్ మాట్లాడుతూ అటు కేంద్రంపై, బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. 'తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే ఏకైక పార్టీ టీఆర్ఎస్. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ కి పరాజయం తప్పదు అన్నట్లు ప్రచారం చేసినా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారు. బీజేపీ నేతలందరూ ఆర్భాట ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు శూన్యం. గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు టీఆర్ఎస్ చేసింది ఏంటో లెక్కలు చెబుతాం. 2లక్షల 72వేల కోట్లు కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది. కేంద్రం నుంచి తెలంగాణ వచ్చింది 1లక్ష 29వేల కోట్లు మాత్రమే. తెలంగాణ టీఆర్ఎస్ ఏమి చేసింది అంటే గంటసేపు ఉపన్యాసం ఇస్తాం..ఎన్డీఏ దేశానికి ఏమి చేసింది అంటే చప్పుడు చేయరు. జీడీపీ లో బంగ్లాదేశ్- శ్రీలంక కంటే వెనుకబడ్డాం. నల్లధనం తెచ్చి ఒక్కో అకౌంట్ లో 15లక్షలు వేస్తా అన్నారు. దేశానికి నల్లధనం తెలీదు కానీ నల్ల చట్టాలు తెచ్చారు.

బీజేపీతో ఏ వర్గం లేదు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మతం పేరుతో చిచ్చుపెట్టాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. తెలంగాణ మట్టిలో పరమత సహనం ఉంది. విద్వేషపు విత్తనాలకు తెలంగాణ లో స్థానం లేదు. కేవలం రాజకీయం కోసం తెలంగాణ పేరును నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి.' అని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్ అంతా కేసీఆర్- కేటీఆర్ తోనే ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్- కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు అన్ని ప్రజలకు అందాలి అంటే కేసీఆర్- కేటీఆర్ వల్లే అవుతుందని తెలిపారు.

Next Story
Share it