Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో 'మాస్ మ్యూచువల్' గ్లోబల్ సెంటర్

హైదరాబాద్ లో  మాస్ మ్యూచువల్ గ్లోబల్ సెంటర్
X

1000 కోట్ల పెట్టుబడి

తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. వారం ప్రారంభంలోనే ఓ ఫ్యార్చూన్ 500 కంపెనీని రాష్ట్రానికి ఆహ్వానించటం కంటే మంచి కార్యక్రమం ఏముంటుందని ట్వీట్ చేశారు. మాస్ మ్యూచువల్ గా పిలుచుకునే మాసాచుసెట్స్ మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ హైదరాబాద్ లో తన గ్లోబల్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.

అమెరికా వెలుపల కంపెనీ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి అని మంత్రి కెటీఆర్ వెల్లడించారు. ఆయన సోమవారం ఉదయం మాస్ మ్యూచువల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయిన అనంతరం ఈ ప్రకటన చేశారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడి ఇది.

Next Story
Share it