Telugu Gateway
Telangana

కెసీఆర్ దృష్టి కుట్ర‌ల‌పైనే..రైతుల‌పై కాదు

కెసీఆర్ దృష్టి కుట్ర‌ల‌పైనే..రైతుల‌పై కాదు
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి 3 లక్షల రూపాయ‌లు ఇస్తానన్న కేసీఆర్.. ముందుగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య వరి ధాన్యం కుప్పలపై ప్రాణాలు వదిలిన రైతులకు తొలుత పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు, కొండగట్టులో చనిపోయిన వారికి, కేటీఆర్ నిర్వాకంతో ఆత్మహత్యలు చేసుకున్న 27మంది ఇంటర్ విద్యార్థులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడే టార్పాలిన్లు, ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, శుభ్రంచేసూ యంత్రాలు లేక అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడ‌న్నారు. కేసీఆర్ కు కుట్ర రాజకీయాలు చేయడంపైనున్న దృష్టి రైతులమీద లేనేలేదని ఎద్దేవా చేశారు. పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు రైతుల నుంచి ధాన్యం సేకరించి విదేశాలకు ఎగుమతుల చేస్తుండగా.. కేసీఆర్ మాత్రం వేషాలేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నార‌ని ఆరోపించారు.

Next Story
Share it