Telugu Gateway
Telangana

ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు

ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు
X

ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ టిఎంఆర్ హెచ్ఎల్) ఎండీ, సీఈవో కె వి బి రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికి గాను కె వి బి రెడ్డికి కన్ స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గ్లోబల్ అవార్డు దక్కింది. ప్రైవేట్ రంగానికి సంబంధించి ఆయన ఈ అవార్డును దక్కించుకున్నారు. వర్చువల్ గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్దును అందుకున్నారు. నిర్మాణ రంగం, వ్యాపారంలో లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్న వారికి ఈ అవార్డు ఇస్తారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు కె వి బి రెడ్డి కన్ స్ట్రక్షన్ వరల్డ్ తోపాటు జ్యూరీకి కృతజ్ణతలు తెలిపారు. ఈ ఏడాది అవార్డు విజేతలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. కె వి బి రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story
Share it