Telugu Gateway
Telangana

మార్కెట్లోకి 'కైనీ' పాలు

మార్కెట్లోకి కైనీ  పాలు
X

హైదరాబాద్ కు చెందిన ఉమోనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి 'కైనీ' పాలను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులను తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆవిష్కరించారు. ప్ర‌స్తుతం మార్కెట్ లో ఉన్న ప‌లు పాల ఉత్ప‌త్తి సంస్థ‌ల కంటే భిన్నంగా దేశీయ ఆవుల నుంచి సేక‌రించిన పాల‌లో ఎటువంటి ర‌సాయనాలు క‌ల‌ప‌కుండా నేరుగా వినియోదారుడు చెంత‌కు చేర‌వేయ‌డ‌మ‌నే ల‌క్ష్యం నిజంగా అభినంద‌నియం అన్నారు తలసాని. భ‌విష్య‌త్ లో సంస్థ తెలంగాణ‌లో ఎన్నొ ఉపాధి అవ‌కాశాలు పెంచ‌డ‌మే కాకుండా నాణ్య‌మైన పాల‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని ఆయ‌న కోరారు.

దాదాపు 200 కోట్ల పెట్టుబడుల‌తో 'కైనీ' బ్రాండ్ పేరుతో స్వ‌చ్చ‌మైన పాల‌ను మార్కెట్ లోకి తెస్తోంది. కైనీ పాల ఉత్పత్తి విడుదల సందర్భంగా సంస్థ ఎండీ సారధి మాట్లాడుతూ "నాణ్య‌త‌లోనే కాకుండా సాంకేతిక‌త‌ను కూడా పూర్తి స్థాయిలో వాడుతున్నాం. అమెరికా మరియు డెన్మార్క్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న యంత్రాలతో , దేశంలో మరెక్కడా లేని సాంకేతిక విజ్ఞానంతో మా తయారీ విధానం వుంది. కాబట్టే అత్యంత స్వచ్ఛత తో పాటు విలువైన పోషకాలతో కూడిన కైనీ పాలు మా వినియోగ దారులకు అందిచగలగుతున్నాం." అని తెలిపారు.

Next Story
Share it