జినోమ్ వ్యాలీలో కెనడా సంస్థ పెట్టుబడులు
కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జి సంస్థ ప్రతిష్టాత్మకమైన జినోమ్ వ్యాలీలోని ఎంఎన్ పార్కులో పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వంద మిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా పది లక్షల చదరపు అడుగుల ల్యాబ్ స్పేస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ బుధవారం నాడు సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే కంపెనీ తన ఆసక్తిని వెల్లడించింది.
ఇవాన్ హో కేంబ్రిడ్జి కెనడాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. జినోమ్ వ్యాలీలోకి ఈ సంస్థ ప్రవేశిస్తుందని చెప్పటానికి తాను ఎంతో సంతోషిస్తున్నట్లు మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో రాబోయే రోజుల్లో పరిశోధన, అభివద్ధి (ఆర్అండ్ డీ) కి, లైఫ్ సైన్సెస్ కార్యకలాపాల కోసం మరింత స్థలం అందుబాటులోకి రానుందని తెలిపారు.