Telugu Gateway
Telangana

ఐసీఐసీఐ బ్యాంక్ 'హోమ్ ఉత్సవ్'

ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ ఉత్సవ్
X

ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంక్ ఐసిఐసిఐ హైదరాబాద్ లో పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని 'హోమ్ ఉత్సవ్'ను ప్రారంభించింది. ఈ వర్చువల్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ లో నగరంలోని ప్రముఖ డెవలపర్లు అందరూ పాల్గొంటున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లే కాకుండా..కస్టమర్లు కాని వారు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొనే వారికి అతి తక్కువ వడ్డీ రేటు తోపాటు స్పెషల్ ప్రాసెసింగ్ ఫీజు, రుణాల మంజూరు వంటి అవకాశాలు కల్పించబోతున్నారు.

35 మంది డెవలపర్లు సుమారు 60 ప్రాపర్టీలను ఈ ప్రదర్శనలో ఉంచబోతున్నారు. కస్టమర్లు తమ ఇంటి నుంచి లేదా ఆఫీస్ నుంచే ఆన్ లైన్ లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. క్వాలిటీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ హోమ్ ఉత్సవ్ ను ప్రారంభించినట్లు బ్యాంక్ సెక్యూరిటీ అసెట్స్ ప్రధానాధికారి రవి నారాయణన్ తెలిపారు.

Next Story
Share it