Telugu Gateway
Telangana

జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ

జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ
X

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు ప్రయత్నాలు ఫలించాయి. ఆయన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీని మేయర్ పీఠం వరించింది. గురువారం నాడు జరిగిన మేయర్, డిప్యూటీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధులు జి. విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలత ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులకు ఎంఐఎం మద్దతు పలికింది. బిజెపి విడిగా అభ్యర్ధులను బరిలో నిలిపింది. అయినా ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ రెండు పదవులను అలవోకగా దక్కించుకుంది.

అంతకు ముందు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ నూతన కార్పొరేటర్లతో సమావేశం అయి మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లోనే వెల్లడిస్తామని...సీఎం కెసీఆర్ అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నందున పార్టీ నిర్ణయించిన వారికి ఓటు వేయాలని కోరారు. అత్యంత ఉత్కంఠ రేపుతూ సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది కానీ...సొంతంగా మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన స్థానాలను గెలవటంలో విఫలమైంది. అయినా సరే ఎక్స్ అఫీషియో ఓట్లు,ఎంఐఎం మద్దతుతో తేలిగ్గా జీహెచ్ఎంసీని చేజారకుండా చూసుకోగలిగింది.

Next Story
Share it