Telugu Gateway
Telangana

తెలంగాణ కొత్త సచివాలయంలో కలకలం

తెలంగాణ కొత్త సచివాలయంలో  కలకలం
X

సర్వ హంగులతో సిద్ధం అవుతున్న తెలంగాణ కొత్త సచివాలయంలో ఊహించని పరిణామం. ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధం అవుతున్న వేళ అక్కడ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం కలకలం రేపుతోంది. తొలుత ఇది మాక్ డ్రిల్ గా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.కానీ స్పష్టంగా ఇది అగ్ని ప్రమాదంగా తేలింది. శుక్రవారం తెల్లవారు జామున నూతన సెక్రటేరియట్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు, అరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్ని మాపక శాఖ అధికారులు.. 11 ఫైర్ ఇంజన్లతో మంటలు అర్పివేశారు. అగ్ని ప్రమాద స్థలిని ఫైర్ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాద సమయంలో పొగలు సచివాలయ భవనం దట్టంగా వెలువడ్డాయి. పొగల ధాటికి సెక్రటేరియట్ వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారింది.

దీంతో ఇది మోక్ డ్రిల్ కాదు ..ప్రమాదం అని స్పష్టం అయింది. ఈ ఘటనపై పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేయడం తప్పు అన్నారు. కేసీఆర్ జన్మదినం రోజే ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోందని ఆరోపించారు. ఆయన జన్మదినం రోజు ప్రారంభించడానికి ఇదేమైనా రాచరికమా?. అగ్నిప్రమాదంపై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి అని డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ కొత్త సచివాలయాన్ని అన్ని వాస్తులు చూసి కట్టిస్తే ఇది ఏంటో అంటూ కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.

అదానీ పై మోడీ మౌనం వీడతారా

Next Story
Share it