Telugu Gateway
Telangana

దుబ్బాక పోలింగ్ రోజు ఫేక్ ప్రచారం

దుబ్బాక పోలింగ్ రోజు ఫేక్ ప్రచారం
X

దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లు కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించాయి. అయితే ఎన్నిక రోజు అంటే మంగళవారం ఉదయమే కాంగ్రెస్ అభ్యర్ధి చెరకు శ్రీనివాసరెడ్డిపై దుష్ప్రచారం ప్రారంభం అయింది. శ్రీనివాసరెడ్డి మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారంటూ ప్రముఖ ఛానళ్ల స్క్రీన్స్ వాడుతూ ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై శ్రీనివాసరెడ్డి కూడా వెంటనే స్పందించారు. ఆయా ఛానళ్ళ ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై పోలీసు స్టేషన్లలో కేసు లు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

ఈ అంశంపై పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయని వీరు ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయని, ఫేక్ న్యూస్ లను వ్యాప్తిలో పెట్టి ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే కుట్రకు శ్రీకారం చుట్టాయన్నారు. ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి వెనుక హరీష్, రఘునందన్ లు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Next Story
Share it