Telugu Gateway
Telangana

నిజామాబాద్ లో దొంగ బాబా అకృత్యాలు

నిజామాబాద్ లో దొంగ బాబా అకృత్యాలు
X

దొంగ బాబా. వైద్యం చేస్తానన్నాడు. మెడిటేషన్ అని మాయమాటలు చెప్పాడు. ఆ ప్రాంత ప్రజలు చాలా మంది నమ్మారు. అంతే కాదు దారుణంగా మోసపోయారు. ఏకంగా ఎంతో మందితో లైంగికంగా తన కోరికలు తీర్చుకున్నాడు. ఈ వ్యవహారం ఇప్పుడు నిజామాబాద్ లో కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి దొంగ బాబాను చితకబాదారు. ఈ వ్యవహరాం అంతా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూసలగల్లీలో జరిగింది. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో అతని బాగోతాలు వెలుగుచూశాయి. గతంలో తాము కూడా అనేక వేధింపులకు గురయ్యామని బాధితులు ఒక్కొక్కరు అసలు విషయాలను వెలుగులోకి తెచ్చారు. పూసల గల్లీలో ఐదేళ్ళ నుంచి భూత వైద్యం మెడిటేషన్ పేరుతో ఈ బాబా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు.

మెడిటేషన్, క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం అంటూ అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లోబరుచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపతున్న మెట్‌పల్లికి చెందిన తల్లీ, కూతురు ఇటీవల ఆ బాబాను ఆశ్రయించారు. అమాయకులైన వారికి మాయమాటలు చెప్పిన దొంగ బాబా తల్లీకూతుళ్లను లోపరుచుకున్నాడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగికదాడికి పాల్పడం, ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. ముందు తల్లిపై ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత మూడు నెలలుగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాధితులు షాక్ కు గురయ్యారు. దొంగబాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it