Telugu Gateway
Telangana

ప్రతి ఎన్నిక హుజురాబాద్ కాదు..ప్రతి అభ్యర్థి ఈటల కాలేరు!

ప్రతి ఎన్నిక హుజురాబాద్ కాదు..ప్రతి అభ్యర్థి  ఈటల కాలేరు!
X

హుజురాబాద్ తో జోష్..మునుగోడు తో లాస్. ఇది తెలంగాణ బీజేపీ పరిస్థితి. ప్రతి ఉప ఎన్నిక హుజురాబాద్ కాదు..ప్రతి అభ్యర్థి ఈటల రాజేందర్ కాలేరు. ఎవరి ఇమేజ్ వారిదే, అన్ని చోట్ల ఒకే ఫలితం వస్తుంది అనుకుంటే పొరపాటే. హుజురాబాద్ జోష్ తోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు కారణం అయింది అనే అభిప్రాయం ఉన్న విషయం తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నిక పరిస్థితులు వేరు....ఈటల రాజేందర్ కు ఉద్యమకారుడిగా ప్రజల్లో ముఖ్యంగా అయన నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. వివిధ రహితుడు. కారణాలు ఏమైనా టిఆఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చిన తేడాల వాళ్ళ బయటకు రావాల్సి వచ్చింది. అందుకే కెసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయన్ను ఓడించలేక పోయారు. మునుగోడు ఆలా కాదన్న విషయం అందరికి తెలిసిందే. కేవలం తెలంగాణ బీజేపీ తన బలం చూపించి రాజకీయంగా లబ్ది పొందటానికి రాజగోపాల్ రెడ్డి ని ఒక అస్త్రంగా వదిలి చూసింది. అది కాస్త బెడిసికొట్టింది. గెలిస్తే ఆ కథ వేరు ఉండేది. కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో నిలవటం ద్వారా రేపు టిఆర్ఎస్ ను ఓడించేది మేమె అని చెప్పు కోవటానికి పనికివస్తారేమో కానీ ఇది అంత ఈజీ కాదు.

ఎందుకు అంటే ప్రతి చోట ఈటల రాజేందర్ లాంటి వారు...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని హంగులు ఉన్న వారు దొరకటం కష్టం. అంతే కాదు తాజాగా తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యే ల కొనుగోళ్ల డ్రామా తో ఇప్పటికిప్పుడు ఎవరు అంత తొందర పడి బీజేపీ లో చేరరు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మునుగోడు లో పడిన దెబ్బ తో బీజేపీ కూడా మరో ఉప ఎన్నికకు సాహసం చేయదు అని భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా మునుగోడు సీన్ రిపీట్ అయితే మరింత డామేజ్ అవుతుంది. అందుకే ఈ పని చేయరని భావిస్తున్నారు. టిఆర్ఎస్ పై మాట్లాడానికి లెక్క లేనన్ని ఇష్యూ ఉన్నందున ఇప్పుడు వాటిపై ఫోకస్ పెట్టి ఎలక్షన్ టైం లోనే చేరికలు..ఇతర అంశాలపై దృష్టి పెట్టడమే కరెక్ట్ అన్న చర్చ సాగుతోంది. మరి రాబోయే రోజుల్లే తెలంగాణ బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తోందో వేచి చూడాల్సిందే. ఇప్పుడు బీజేపీ కోసం ఏడాది ఉన్న పదవి కాలం వదులుకుని ఎవరు మునుకు వస్తారు...వచ్చినా ఒకవేళ మునుగోడు ఫలితం రిపీట్ అయితే అది పార్టీ కే కాకుండా పోటీ చేసి పరాజయం పలు అయిన వాళ్లకు కూడా రాజకీయంగా నష్టమే.

Next Story
Share it