Telugu Gateway
Top Stories

నాయినిని పరామర్శించిన సీఎం కెసీఆర్

నాయినిని పరామర్శించిన సీఎం కెసీఆర్
X

మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయిని నర్సింహారెడ్డిని బుధవారం నాడు సీఎం కెసీఆర్ పరామర్శించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నాయినిని చూసి కంట తడి పెట్టారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాయిని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని ఇటీవల కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో ఈ నెల 13న‌ తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it