Telugu Gateway
Telangana

ఎమ్మెల్యేల ఎర కేసు...కెసిఆర్ సర్కారుకు బిగ్ షాక్

ఎమ్మెల్యేల ఎర కేసు...కెసిఆర్ సర్కారుకు బిగ్ షాక్
X

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు లో కీలక పరిణామం. తెలంగాణ లోని కెసిఆర్ సర్కారు కి ఇది బిగ్ షాక్ కిందే లెక్క. ఎందుకంటే సిబిఐ కి కేసు అప్పగించటం సర్కారుకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే అంశంపై హై కోర్ట్ డివిజన్ బెంచ్ ముందు బలంగా వాదనలు వినిపించింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణ కు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థిస్తూ.. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ ఆర్డర్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోరారు. అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని కోరారు.

అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇక సిబిఐ వెంటనే రంగంలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసు లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం జనవరి 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ అంశంపై సోమవారం తుది తీర్పు వెలువరించారు. దీంతో ఈ కేసు లో ఇంకా ఎన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Next Story
Share it