Telugu Gateway
Telangana

బుర్జ్ ఖ‌లీఫాపై బ‌తుక‌మ్మ ప్ర‌ద‌ర్శ‌న‌

బుర్జ్ ఖ‌లీఫాపై బ‌తుక‌మ్మ ప్ర‌ద‌ర్శ‌న‌
X

తెలంగాణ‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మంగా నిర్వ‌హించే బ‌తుక‌మ్మ ఉత్స‌వ వీడియోను ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన కట్ట‌డం బుర్జ్ ఖ‌లీఫాపై ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. శ‌నివారం సాయంత్రం 9.40 నిమిషాలకు , 10.40 నిమిషాలకు ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. దీనికి సంబంధించి ఏర్పాట్ల‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం సాగ‌నుంది. బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది అని తెలిపారు. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మ ను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు సాయంత్రం దుబాయ్ లో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Next Story
Share it