తెలంగాణకు 15 కోట్ల సాయం ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్
BY Admin20 Oct 2020 6:38 AM

X
Admin20 Oct 2020 6:38 AM
తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని వెల్లడించారు.
ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా పది కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వరదల కష్టకాలంలో తెలంగాణకు అండగా నిలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు పళనిస్వామిలకు తెలంగాణ సీఎం కెసీఆర్ కృతజ్ణతలు తెలిపారు. వీరిద్దరితోనూ కెసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు.
Next Story