Telugu Gateway
Telangana

కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ మారిన అల్లు అర్జున్ అరెస్ట్

కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ మారిన అల్లు అర్జున్ అరెస్ట్
X

హైడ్రా...మూసి...అల్లు అర్జున్. ఇలా వరస ఎదురుదెబ్బలు రేవంత్ రెడ్డి సర్కారు అలా వంతుగా మారినట్లు అయింది. ఏదైనా ఒక పని చేయాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు దీనికి అవసరం అయిన ఎన్నో వనరులు ఉంటాయి కూడా. నాయకత్వం వహించే వ్యక్తి..ఆయన ఆదేశాలను అమలు చేసే టీం ఇక్కడ ఎంతో కీలకం. ఎప్పుడైనా ఒక సారి పొరపాటు జరగటం సహజం. కానీ పొరపాట్లే అలవాటుగా మారితే ఎలా అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల వాదన. శుక్రవారం నాడు హైదరాబాద్ వేదికగా సాగిన అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రేవంత్ రెడ్డి ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసే వ్యవహారంగా మారింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు ఆయన ఈ పని చేయటానికి ఎంచుకున్న టైమింగ్...ఇది అమలు చేసిన తీరు కాంగ్రెస్ నేతలను కూడా షాక్ కు గురి చేస్తోంది. ఒక వైపు తొలిసారి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం లోక్ సభలో మాట్లాడుతున్న సమయంలోనే హైదరాబాద్ లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మొదలైంది. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా మారిపోయారు.

తెలుగు రాష్ట్రాల కంటే హింది బెల్ట్ లోనే ఈ సినిమా కలెక్టన్స్ పరంగా దుమ్మురేపుతోంది. మీడియా ఎప్పుడైనా ఏ వార్త ఇంటరెస్టింగ్ ఉంటే వాటికే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో నేషనల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైనే ఫోకస్ పెట్టింది. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురి చేసింది. అసలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరి కోసం పని చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది అని ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి కి కారణమైన వాళ్లలో అల్లు అర్జున్ , ఆయన భద్రతా సిబ్బంది కూడా బాద్యులే. అందుకే వాళ్లపై కేసు కూడా నమోదు అయింది. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ వంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అరెస్ట్ చేస్తే..ఆ వెంటనే బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటే అది ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీస్తుంది.

కేసు లోని సాంద్రత వంటి అంశాలు అన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉండగా...వ్యవహారం అలా సాగలేదు అనే చర్చ సాగుతోంది. ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో అల్లు అర్జున్ అరెస్ట్ లో తన పాత్ర ఏమి లేదు...చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఒక స్టాక్ డైలాగు చెప్పినా కూడా సీఎం నోటీసు లో పెట్టకుండా...అది కూడా హోమ్ మంత్రిత్వ శాఖ సీఎం స్వయంగా చూస్తున్న వేళ పోలీస్ అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఎవరు నమ్మరు అనే చెప్పొచ్చు. వాస్తవానికి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అనే వార్త వచ్చిన వెంటనే ఒక మహిళ మృతికి కారణమైన టాప్ హీరో అయినా సరే తాము వదలం అనే సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం అయింది.

ఎందుకంటే నిజంగానే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారు అని ఎవరు నమ్మలేదు కూడా. కానీ ప్రభుత్వ నిర్ణయం మాత్రం హీరో లైనా..ఎవరైనా చట్టం ముందు ఒకటే అనే మెసేజ్ పంపినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ అరెస్ట్ జరిగిన తర్వాత కారణాలు ఏమైనా కూడా అల్లు అర్జున్ కు హై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో ప్రభుత్వ పరువు పోయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే తెలంగాణ హై కోర్టు లంచ్ మోషన్ పిటిషన్ తీసుకోవటం కూడా అసాధారణంగా జరిగింది అనే అభిప్రాయం కొంత మంది న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో లోయర్ కోర్టు ఒక సారి రిమాండ్ విధించిన తర్వాత మధ్యంత బెయిల్ ఇవ్వటం అన్నది కూడా కొత్త సంప్రదాయం అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it