Top
Telugu Gateway

బిజెపి సాధించిన ఘనత ఇదే

బిజెపి సాధించిన ఘనత ఇదే
X

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కారుపై వ్యంగాస్త్రాలు సంధించారు. తలసరి ఆదాయంలో భారత్‌ను బంగ్లాదేశ్‌ అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్‌ అంచనాలను ప్రస్తావిస్తూ, ''ఆరు సంవత్సరాల్లో బీజేపీ పాలన సాధించిన ఘనత ఇదీ' అని రాహుల్‌ ఎద్దేవా చేశారు. అంతే కాదు కరోనా నియంత్రణలో కూడా పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌‌ వంటి దేశాలు భారత్‌ కంటే ఉత్తమంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

దేశాల ఉత్పాదకత, కరెన్సీల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలకు సంబంధించిన పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ (పీపీపీ) విధానం ప్రకారం చూస్తే, భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019లో బంగ్లాదేశ్‌కన్నా 11 రెట్లు అధికమని అధికార వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. కరోనా కారణంగాభారత్‌ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్‌ తాజా నివేదికలో అంచనావేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it