Telugu Gateway
Politics

ఉద్రిక్తతలు పెంచుతున్న చైనా

ఉద్రిక్తతలు పెంచుతున్న చైనా
X

ఓ వైపు చర్చలు అంటూనే చైనా ఉద్రిక్తతలు పెంచుతోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని..అదే సమయంలో దేశంపట్ల విశ్వాసపాత్రంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చైనా దూకుడు చూపుతోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత కొంత కాలంగా సరిహద్దుల్లో భారత్ తో ఈ డ్రాగన్ దేశం ఉద్దేశపూర్వక వివాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా జిన్ పింగ్ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మెరైన్‌ దళాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

అందులోనే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ''మీ అందరూ ఈ విషయంపై దృష్టి సారించి, శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధానికి సన్నద్ధం కావాలి'' అని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్‌ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తీరు పట్ల అగ్రరాజ్యం అమెరికా సహా భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర క్వాడ్‌ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. భారత ఉత్తర సరిహద్దులో చైనా ఇప్పటికే 60 వేల మంది సైనికులను మోహరించింది.

Next Story
Share it