మాజీ ప్రధాని కూతురు రూమ్ బద్దలు కొట్టి..!
BY Admin20 Oct 2020 10:48 AM IST

X
Admin20 Oct 2020 10:48 AM IST
మరియం నవాజ్. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె. ఆమె కరాచీలోని ఓ హోటల్ లో భర్తతో కలసి ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ పోలీసులు రూమ్ తలుపులు విరగ్గొట్టి..లోపలికి ప్రవేశించి మరియం భర్త సఫ్దర్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఆమె దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను రూమ్ లో నిద్రపోతున్న సమయంలో పోలీసులు లోపలికి ప్రవేశించారని ఆరోపించారు.
మరియం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు పీటీఐ పార్టీపై విమర్శలు చేసిన వెంటనే ఈ పోలీసులు రంగంలోకి దిగటం విశేషం. తన భార్య లోపల నిద్రపోతుందని..లోపలికి రావొద్దని సఫ్దర్ కోరినా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. తనపై ఈ తరహా దాడి జరుగుతుందని ఊహించలేదని మరియం వ్యాఖ్యానించారు.
Next Story



