Telugu Gateway
Politics

ముగిసిన ఒక్క రోజు అసెంబ్లీ

ముగిసిన ఒక్క రోజు అసెంబ్లీ
X

ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పెట్టడం చాలా అరుదు. కానీ తెలంగాణలో ఈ మధ్య కాలంలో అలాంటి అరుదైన సన్నివేశాలు ఎన్నో జరుగుతున్నాయి. గత నెలలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినా కరోనా కారణంగా ఈ సమావేశాలను అర్ధారంతరంగా కుదిరించారు. కానీ ప్రభుత్వం తాను అనుకున్న బిల్లులను ఆమోదించుకునేందుకు మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. ఒక్క రోజులోనే ప్రభుత్వం నాలుగు బిల్లుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం పొందింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు.

అనంత‌రం బిల్లులపై చ‌ర్చించి.. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్‌ ల‌కు మంత్రులు స‌మాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఈ నాలుగు బిల్లుల‌ను ఆమోదిస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. సభ ఆమోదం పొందిన వాటిలో ఇండియ‌న్ స్టాంప్ బిల్లు(తెలంగాణ‌)2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020ను శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ స‌వ‌ర‌ణ బిల్లు-2020ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు - 2020ను న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. ఈ నాలుగు బిల్లులనూ సభ ఆమోదించింది.

Next Story
Share it