Telugu Gateway
Politics

దుబ్బాకలో బిజెపి, కాంగ్రెస్ లకు డిపాజిట్లు డౌటే

దుబ్బాకలో బిజెపి, కాంగ్రెస్ లకు డిపాజిట్లు డౌటే
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ దుబ్బాక ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అక్కడ గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీనే సాధిస్తుందని తెలిపారు. కెటీఆర్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. బిజెపి పార్టీ సమాజం లో తక్కువ, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అని ఎద్దేవా చేశారు. గోబెల్స్ కే పాఠాలు చెప్పే స్థితిలో బిజెపి ఉందన్నారు. బిజెపి ది డొల్ల ప్రచారమని..దుబ్బాక గడ్డకు ప్రజా చైతన్యం ఉందని పేర్కొన్నారు. బిజెపి నేతలు పోలీసులు పై మాట్లాడిన భాషను ఖండిస్తూ న్నామని..తాము మాట్లాడితే పీఎం, కేంద్ర మంత్రులను వదలమని ..తాము కూడా బూతులు మాట్లాడగలుగుతమని హెచ్చరించారు.

27 వేల 718 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ తెలంగాణ చేసినట్టు ఆర్ బిఐ నివేదిక ఇచ్చిందని.. ఆ ఘనత కేసీఆర్ కి, మా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రైతు బంధు రూపంలో 28 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని.. జీఎస్ డీపీలో వ్యవసాయ రంగం వాటా రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణ లో తలసరి ఆదాయం అరేళ్ళలో రెట్టింపు అయ్యిందని.. దివాలాకోరు ప్రతిపక్షాలు ఆర్ బిఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్ కు జై కొడుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణ అప్పుల్లో ఉందని మొత్తుకుంటున్నారు.. కానీ రాష్ట్ర ఆదాయం పెరిగిందని గుర్తించాలన్నారు. షీ టీమ్స్ పైన కూడా ఒక మంచి రిపోర్ట్ వచ్చిందని తెలిపారు.

Next Story
Share it