Top
Telugu Gateway

చంద్రబాబు చెప్పినట్లు ఎన్నికలు పెట్టరు

చంద్రబాబు చెప్పినట్లు ఎన్నికలు పెట్టరు
X

కరోనా కారణంగా ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఎన్నికలు జరగవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు కుదరవన్నారు. మంత్రి శుక్రవారం రామ్మూర్తినగర్, ఏఎస్‌నగర్‌లో 'నాడు-నేడు' పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కాదని, వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.

Next Story
Share it