ప్రతిపక్ష నేత చంద్రబాబా..లోకేషా
జగన్ ప్యాలెస్ వీడి బయటకు రారా?
ఏపీలో వరద రాజకీయం మొదలైంది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ శుక్రవారం నాడు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లోకేష్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ప్యాలెస్ వీడి బయటకు రారా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేసిన తర్వాతే జగన్ వరదలపై సమీక్ష నిర్వహించారని..అప్పటి వరకూ జగన్ కు వరదల గురించి సమీక్షించాలని కూడా తెలియదా? అంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ విమర్శలపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబా..నారా లోకేషా అని కొడాలి నాని ప్రశ్నించారు. అసలు వాడెవడు?. ఏమి చూశాడు లోకేష్ వచ్చి..గట్లు చూశాడా..నీళ్లు చూశాడా?. మేం అడిగింది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గురించి. అంతే కానీ లోకేష్ వచ్చాడు...చంద్రబాబు మనవడు వచ్చి గట్ల మీద ఆడుకుని వెళ్లాడు అంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మా అభ్యర్ధిపై మంగళగిరిలో ఓడిపోయిన బఫూన్ లోకేష్ అంటూ మండిపడ్డారు. 16 నెలల్లో కొవ్వు చాలా కరిగింది. పిచ్చవాగుడు వాగుతున్నాడు. కళ్లు నెత్తినెక్కాయి. వాటిని కూడా కిందకు దింపుతాం త్వరలోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.