Telugu Gateway
Politics

ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ బైడెన్

ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ బైడెన్
X

భారత్ ను మురికి దేశం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రభుత్వపరంగా దీనిపై పెద్దగా స్పందించిన దాఖలాలు కన్పించలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మోడీ ట్రంప్ ను గుజరాత్ కు ఆహ్వానించి ఓ భారీ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మురికివాడలు కన్పించకుండా గుజరాత్ లో కట్టించిన అడ్డుగోడలపై కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దేశంపై అమెరికా అధినేత అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసినా భారత్ కనీసం స్పందించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ ప్రత్యర్థి, డెమాక్రటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బైడెన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. స్నేహితుల గురించి మాట్లాడే తీరు ఇది ఏ మాత్రం కాదని వ్యాఖ్యానించారు.

ట్రంప్ భారత్ ను మురికిదేశంగా పిలిచారు. వాయు కాలుష్యం అనేది అందరూ కలసి ఎదుర్కోవాల్సిన అంశం అన్నారు. ఇలాంటి అంశాలపై మిత్రులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. తాను, డెమాక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ భారత్ తో అమెరికా భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తామని అన్నారు. అమెరికా విదేశాంగ విధానాన్నితిరిగి గౌరవప్రద స్థానంలో నిలుపుతామని అన్నారు. ఒబామా, బైడెన్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూలేని విధంగా భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు సాగాయన్నారు.

Next Story
Share it