Telugu Gateway
Politics

ఓడిపోతే దేశం వదిలిపోతా!

ఓడిపోతే దేశం వదిలిపోతా!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ చేతిలో ఓటమి పాలైతే తాను దేశం వదిలిపోవచ్చని వ్యాఖ్యనించి కలకలం రేపారు. రెండో సారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ట్రంప్ అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో చెత్త అభ్యర్ధిపై పోటీ చేయటం ద్వారా తాను ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ తాను ఓడిపోతే అమెరికా రాజకీయ చరిత్రలో ఓ చెత్త అభ్యర్ధిపై ఓడిపోయినట్లు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే జో బైడెన్ కు వచ్చిపడుతున్న ఎన్నికల విరాళాలు చూసిన వారు ఎన్నికల్లో మొగ్గు బైడెన్ వైపే ఉండొచ్చనే అంచనాలకు వస్తున్నారు. అయితే ట్రంప్ చివరి నిమిషంలో ఏమైనా జిమ్మిక్కులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది మరికొంత మంది అభిప్రాయం. కరోనా వైరస్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని కరోనా కారణంగా అత్యధికంగా ప్రాణాలు నష్టపోయిన దాంట్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది.

Next Story
Share it