ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమాక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తేదీ దగ్గరకొస్తుండటంతో విమర్శల జోరు మరింత పెంచారు. ఈ ఎన్నికల్లో అత్యంత చెత్త అభ్యర్ధిపై పోటీచేయాల్సి రావటం బాధగా ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికలు అమెరికా కలలకు, సోషలిస్టుల పీడకలలకూ మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్ష్డుడు అయితే దేశం మరో వెనిజులా మాదిరిగా మారిపోతుందని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానని..మరో నాలుగేళ్ళు వైట్ హౌస్ లో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు ట్రంప్. అమెరికా ప్రజలు మార్కిస్టులను, సోషలిస్టులను, అల్లరి మూకలను ఓడించబోతున్నామని తెలిపారు. ట్రంప్ ఎన్ని మాటలు చెబుతున్నా వాతావరణం జో బైడెన్ కే అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం తన దూకుడు తగ్గించటం లేదు. నవంబర్ 3న అమెరికా లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.