Top
Telugu Gateway

అలా చేస్తే సీఎం కెసీఆర్ వంద మెట్లు దిగొస్తారు

అలా చేస్తే సీఎం కెసీఆర్ వంద మెట్లు దిగొస్తారు
X

దుబ్బాక ఉప ఎన్నిక అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తిరిగి టీఆర్ఎస్ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని అన్నారు. టీఆర్ఎస్ ను ఓడిస్తే సీఎం కెసీఆర్ వంద మెట్లు దిగొస్తారని వ్యాఖ్యానించారు. లేదంటే ఏమీ చేయకపోయినా తాను మళ్లీ గెలుస్తానని కాలర్ ఎగరేస్తారని అన్నారు. జగ్గారెడ్డి బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ యూనివర్శిటీ విద్యార్ధులు అందరూ దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయాలని కోరారు. రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే అయినప్పటికీ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపమన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు బలంగానే ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు మాత్రం డబ్బు, పోలీసుల బలం ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకులా పనిచేస్తున్నారని ఆరోపించారు.

అందువల్లే ఎన్నిక జరగక ముందే గెలిచినట్లుగా హరీశ్‌ రావు భావించి మెజారిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు. లక్ష రూపాయల రూణమాఫీ, 57 ఏళ్లకే పెన్షన్‌, 12 శాతం రిజర్వేషన్‌లు, ఎస్సీలకు 12 రిజర్వేషన్‌లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా మళ్లీ ఎలక్షన్‌లో గెలిచినందుకు సీఎం కేసీఆర్‌ గల్లా ఏగిరేస్తున్నాడన్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవేమీ ఇవ్వకపోయిన గెలుస్తామనే థీమా వాల్లకు వస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

Next Story
Share it