Telugu Gateway
Politics

ఎస్ఈసీ వర్సెస్ వైసీసీ తగ్గని వార్

ఎస్ఈసీ వర్సెస్ వైసీసీ తగ్గని వార్
X

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ వార్ ఏ మాత్రం తగ్గటం లేదు. ఓ వైపు మంత్రి కొడాలి నాని, మరో వైపు ఎమ్మెల్యే జోగి రమేష్ లు అదే దూకుడు చూపిస్తున్నారు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చూపించుకోవాలని సలహా ఇస్తే నోటీసులు ఇస్తారా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చూపించుకోవాలా ...వద్దా అన్నది ఆయన నిర్ణయమే అని..తాను సలహా మాత్రమే ఇచ్చానన్నాను. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నట్లు చూపించుకోవాలసిన బాధ్యత రమేష్ కుమార్ పై ఉందన్నారు. చంద్రబాబు ఎస్ఈసీ దారుణంగా విఫలమయ్యాడు అంటే ఏమీ మాట్లాడని నిమ్మగడ్డ తమకు మాత్రం నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. నోటీసులకు తాను ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందకపోతే ఉరి తీస్తారా? అని ప్రశ్నించారు. తాను మాట్లాడకపోతే ఇతరులు మాట్లాడతారన్నారు. తాను శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని చెప్పారు. ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని తెలిపారు.

ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందన్నారు. వివరణ పరిశీలించి షోకాజ్‌ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు. అంతకు ముందు కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం షోకాజ్ నోటీసు ఇచ్చింది. మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కించపరుస్తు వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యింది. మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది.

Next Story
Share it