విరాళాల వివాదం..విద్యాసాగర్ రావు క్షమాపణ
BY Admin22 Jan 2021 1:52 PM IST
X
Admin22 Jan 2021 2:21 PM IST
ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్య రామాలయానికి మనం ఎందుకు విరాళాలు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపటం..మరో వైపు బిజెపి దీనిపై నిరసనలకు దిగటంతో ఆయన మాట మార్చారు. తాను కూడా రాముడి భక్తుడిని అని..అయోధ్య కూడా వెళ్ళానన్నారు.
తన వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. తాను వ్యక్తిగతంగా ఆ వ్యాఖ్యలు చేస్తే ...కొంత మంది దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి మత రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు. దీనిపై రాజకీయం చేయటం తగదన్నారు.
Next Story