Telugu Gateway
Politics

సీపీఆర్ వో జ్వాలాను ప‌ద‌వి నుంచి త‌ప్పించాలి

సీపీఆర్ వో జ్వాలాను ప‌ద‌వి నుంచి త‌ప్పించాలి
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్ ముఖ్య ప్రజా సంబంధాల‌ అధికారి జ్వాలా నరసింహా రావు పై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, ఆయ‌న్ను వెంట‌నే పదవి నుండి తొలగించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ‌వర్నర్ కు లేఖ రాసింది. ప్రభుత్వ ఉద్యోగిగా పాటించాల్సిన నియమ నిబంధనలను ఉల్లంఘించి ఆంధ్రజ్యోతి పత్రిక లో ఈ నెల 5 వ తేదీన ప్రచురించబడిన ఆయన వ్యాసాన్ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజ‌న్ త‌ప్పుప‌ట్టారు. జ్వాలా నరసింహా రావు ముఖ్య మంత్రి కె.సి.ఆర్ కు ముఖ్య ప్రజా సంబందాల అధికారిగా పని చేస్తున్నారని , ఆయన ఉన్నది ప్రభుత్వ పోస్ట్ అని , ఆయన తీసుకుంటున్న జీతభత్యాలు ప్రభుత్వ ట్రెజరీ నుండే తీసుకుంటున్నారని, ప్రభుత్వోద్యోగులకు వర్తించే నియమనిబంధనలు అన్నీ ఆయనకు వర్తిస్తాయని ఆ లేఖ లో పేర్కొన్నారు. ముఖ్య ప్రజా సంబదాల అధికారిగా ఆయన ప్రజలకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సత్సంబందాలు ఉండే విధముగా చూస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే భాధ్యత కల్గి ఉంటారని. రాజకీయ అంశాలలో జోక్యం కలిగించుకోకుండ వ్యవహరించాల్సి ఉంటుందని ఆ లేఖలో వివరించారు. రాజకీయ వివాదాలలో తలదూర్చకుండ అధికార పార్టీ చేసే రాజకీయ ట్రిక్కులకు, రాజకీయ ఆటలకు వత్తాసు పలుక కుండా హుందాగా ఉండాల్సిన భాధ్యత ఆయనద‌న్నారు.

తన పరిమితిని దాటి ఆయన పార్టీ మార్పిడులు తెలంగాణాలో సుస్థిర సాధించడానికేనని ఆయన త‌న‌ వ్యాసములో వత్తాసు పలుకడము దురదృష్టకరమని ఆ లేఖలో ప్ర‌స్తావించారు. ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని కాకుండా వేలాది మంది టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరడము ఆషామాషిగా జక‌గ‌డ‌ము లేదని రాజకీయ పునరేకీకరణ లో భాగంగా జరుగుతున్నదని పేర్కొన్న ఆయన ఒక క్షణము కూడా ఆ పదవిలో కొనసాగే అర్హతను కొల్పోయారని పేర్కొన్నారు. ఒక పార్టీ లో గెలిచి మరొక పార్టీలో కి మారడము తప్పేమీ కాదని అది బంగారు తెలంగాణా సాధన కే జరుగుతున్నదని అని ఒక అధికారి అనడము పిరాయింపుల వ్యతిరేక చట్ట స్పూర్తికి విరుద్దమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల లోని నాయకులు ఆయా పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించలేని దుస్థితి లో ఉన్నందుననే వారు టి.అర్ఎస్ లో చేరుతున్నారని ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా రాశారు. ఇతర పార్టీలనుండి చేరికలతో టి.ఆర్.ఎస్ పార్టీ మరింత బలపడుతుందనడము, సి.ఎమ్ కె.సి.ఆర్ సంక్షేమ పథకాల కారణాన పార్టీ మారితే తప్పేమేమనడము ఆయన లోని వికృతత్వానికి నిదర్శనమ‌ని పేర్కొన్నారు.

Next Story
Share it