Telugu Gateway
Politics

వరద బాధితుల సాయంలోనూ కమిషన్లా?

వరద బాధితుల సాయంలోనూ కమిషన్లా?
X

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గ్రేటర్ లో వరద సాయం దుర్వినియోగం అంశంపై ముఖ్యమంత్రి కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో సర్కారు తీరును ఆయన తప్పుపట్టారు. రెండు రోజుల్లో పంపిణీని తిరిగి ప్రారంభించాలని..లేదంటే క్షేత్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. 'గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి .శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా... వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారు.

మీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే... వీళ్లు మనుషులేనా, మానవత్వం ఉందా అనిపిస్తోంది. గ్రేటర్ లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ కుంభకోణానికి కారణం. చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు. మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన దోపిడీ పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story
Share it