Telugu Gateway
Politics

తెలంగాణ‌లో అస‌లు ఆట మొద‌ల‌వుతుందా?

తెలంగాణ‌లో అస‌లు ఆట మొద‌ల‌వుతుందా?
X

కీల‌క ప‌రిణామం. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సార‌ధి వచ్చేశారు. ఎంత మంది వ్య‌తిరేకించినా కాంగ్రెస్ అధిష్టానం మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డినే పీసీసీ ప్రెసిడెంట్ గా ప్ర‌క‌టించింది. దీంతో తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త మార్పులు రాబోతున్నాయి. రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ నేత‌గా పేరుంది. ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై విమ‌ర్శ‌లు చేయ‌టంలో ముందు వ‌ర‌స లో ఉంటారు. కాంగ్రెస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాల వ‌ల్ల కొంత కాలంగా ఇది కాస్తా త‌గ్గిన‌ట్లే అన్పించేది. ఇప్పుడు సార‌ధే ఆయ‌న కావ‌టంతో ఇక ఎలాంటి మార్పులు ఉంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. శ‌నివారం సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి నియామకానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసింది.

రేవంత్ రెడ్డితో పాటు భారీ టీమ్ నే ప్ర‌క‌టించింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించింది. వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్‌గౌడ్‌, గీతారెడ్డి, అజారుద్దీన్‌, అంజన్‌కుమార్‌.. వైస్‌ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, మ‌ల్లు రవి, వేంనరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్, కుమార్‌రావ్‌, జావెద్‌ అమీర్‌, గోపిశెట్టి నిరంజన్‌, పోడెం వీరయ్య, సురేష్‌ షెట్కర్‌.. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధుయాష్కీ‌, కన్వీనర్‌గా అజ్మతుల్లా హుస్సేన్‌.. ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు.

Next Story
Share it