మోడీ జీడీపీ బాగా పెంచారు
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ జీడీపీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. జీడీపీ అంటే గ్యాస్, డీజీల్, పెట్రోల్ అని తెలిపారు. ప్రజలు ఓ వైపు కరోనా కారణంగా కష్టాల్లో ఉంటే మోడీ సర్కారు మాత్రం ఈ రేట్లు అడ్డగోలుగా పెంచుతూ..జీడీపీ పెరుగుదలకు తన వంతు కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. గడిచిన వారంలో నాలుగోసారి రేట్లు పెంచిన తరువాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు రూ.85.70, ముంబైలో రూ.92,28గా ఉంది. అలాగే డీజిల్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ.75,88 ఉండగా ముంబైలో లీటరుకు రూ.82,66గా ఉంది. ఈ వారంలో లీటరుకు రూ.1పైగా పెరిగింది. అలాగే హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ ధర రూ.82.80గా ఉంది.