Telugu Gateway
Politics

మోడీపై లాలూ పంచ్

మోడీపై లాలూ పంచ్
X

ప్రధాని నరేంద్రమోడీ బీహార్ ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే ఒక డైలాగ్ చెబుతున్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో జెడీయూ ప్రభుత్వాలు ఉంటేనే బీహార్ లో 'డబుల్ ఇంజన్' ప్రగతి సాధ్యం అవుతుందని చెబుతూ వస్తున్నారు. దీనిపై లాలూ పంచ్ పేల్చారు.అది డబుల్ ఇంజన్ కాదు..ట్రబుల్ ఇంజన్ అంటూ ఎద్దేవా చేశారు ఆర్జేడీ అధినేత లాలూ. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన కూలీలను వెనక్కి తెచ్చే సమయంలో ఈ డబుల్ ఇంజన్ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.

ట్విట్టర్ ద్వారా లాలూ ఈ కామెంట్స్ చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని గెలిపించే బాధ్యతను ఇప్పుడు లాలూ తనయుడు తేజస్వి యాదవ్ మోస్తున్నారు. ఆయన ప్రచారంలో కూడా దూసుకెళుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జెడీయూ, బిజెపి కూటమికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా తేజస్వి యాదవ్ యువతకు ఉద్యోగాల అంశాన్ని టార్గెట్ గా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Next Story
Share it