Telugu Gateway
Politics

కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల స్కామ్..అంతా టీఆర్ఎస్ వాళ్ళే

కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల స్కామ్..అంతా టీఆర్ఎస్ వాళ్ళే
X

రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

హెచ్ఎండీఏ భూముల వేలంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూడు వేల కోట్ల రూపాయ‌లు రావాల్సిన భూముల వేలానికి రెండు వేల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని అన్నారు. ఈ వెయ్యి కోట్ల రూపాయ‌ల దొపిడీ ఎలా జ‌రిగిందో...ఇందులో ఏయే కంపెనీలు ..అందులో ఎవ‌రు ఉన్నారో..ఎవ‌రు ఎవ‌రికి బినామీలో రేపు చెబుతాన‌న్నారు. ఒక్కో ఎక‌రం అర‌వై కోట్ల రూపాయ‌ల‌కు పోవాల్సి ఉంటే...ఒక్కో రేటుకు విక్ర‌యించార‌ని..ఎవ‌రినీ వేలంలోకి రాకుండా చేశార‌ని ఆరోపించారు. ఈ భూముల వెన‌క బినామీలు ఉన్నార‌న్నారు.ఈ కొకాపేట భూములు కొనుక్కున్న వాళ్ళు ఎవ‌రు.. ఎవ‌రి చుట్టాలు ? ఎవ‌రి అనుచ‌రులు..అధికార పార్టీ ఎంపీలు..ఎమ్మెల్సీల‌కు..ఎలా ఇచ్చారు.

కాళ్ళు మొక్కిన వారికి ఎలా ఇచ్చారో రేపు బ‌య‌ట‌పెడ‌తా. ఇందులో మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. కొన్ని గంట‌ల్లో టీఆర్ఎస్ వాళ్లు వెయ్యి కోట్లు జుర్ర‌కున్నారు. వీరి బండారం అంతా రేపు వివ‌రిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో షర్మిల పార్టీని ఎన్జీవోతో పోల్చారు. ఆమెకు అన్న‌తో ఏదో గొడ‌వ ఉంద‌ని..అక్క‌డ తేల్చుకోవాలి కానీ ఇక్క‌డ ఏమి చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. మీడియా వాళ్లు కూడా ఈ విష‌యాన్ని వ‌దిలేస్తే తెలంగాణ‌కు మంచి జ‌రుగుతుంద‌ని తెలిపారు.

Next Story
Share it