Telugu Gateway
Politics

వైట్ హౌస్ ఇక జో బైడెన్ 'డెన్'

వైట్ హౌస్ ఇక జో బైడెన్ డెన్
X

అమెరికా 46 అధ్యక్షుడిగా ఎన్నిక

ఉత్కంఠ వీడింది. అమెరికా అధ్యక్షుడుగా డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగ్గా..అధ్యక్షుడు ఎవరు అనేది తేలటానికి నాలుగు రోజుల సమయం పట్టింది. భారతీయ కాలమానం ప్రకారం శనివారం రాత్రి పది గంటల సమయంలో అధికారిక ప్రకటన వెలువడింది. నువ్వా..నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో జో బైడెన్ అన్ని అడ్డంకులను అధిగమించి కావాల్సిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించి అమెరికా 46వ అధ్యక్షుడగా ఎన్నికయ్యారు. దీంతో జో బైడెన్ ఎన్నిక అధికారికం అయింది. ప్రస్తుతం జో బైడెన్ 284 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించారు. ఈ సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆయన కావాల్సిన మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్నారు.

జో బైడెన్ అధ్యక్షుడిగా, కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం 214 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఈ అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ ఎన్నో రికార్డులు సాధించారు. ఇప్పటి వరకూ ఏ అమెరికా అధ్యక్షుడుగా సాధించని రీతిలో పాపులర్ ఓట్లు కూడా దక్కించుకున్నారు. జో బైడెన్ ఎన్నికైనట్లు ప్రకటన వెలువడగానే డెమాక్రటిక్ పార్టీ కార్యకర్తలు ఆనందంతో వైట్ హౌస్ ముందు ఆనందంతో ర్యాలీ నిర్వహించారు. మరో వైపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు కోర్టులను ఆశ్రయిస్తూ ఎన్నికల ప్రక్రియపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story
Share it