Telugu Gateway
Politics

వైట్ హౌస్ కు చేరువలో జో బైడెన్

వైట్ హౌస్ కు చేరువలో జో బైడెన్
X

జో బైడెన్ చెప్పినట్లు ట్రంప్ మూటా..ముల్లే సర్దుకోవాల్సిందే

జో బైడెన్ కు 253, ట్రంప్ కు 214 ఎలక్ట్రోరల్ ఓట్లు

జో బైడెన్ తాజాగా ఓ మాట చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి మూటాముల్లే సర్దుకుని రెడీగా ఉండాలన్నారు. తానే గెలుస్తాననే ధీమాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే నిజం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తిరిగి శ్వేతసౌథంలో కూర్చోవటం జరిగే పని కాదని స్పష్టం అవుతోంది. డెమాక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బైడెన్ కేవలం 17 ఓట్ల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 253 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించారు. ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ల అభ్యర్ధి 214 ఎలక్ట్రోరల్ ఓట్ల వద్దే ఆగిపోయారు. ప్రస్తుతం ట్రంప్ లీడ్ లో ఉన్న రాష్ట్రాల్లో అన్ని సీట్లు గెలుచుకుంటే తప్ప ట్రంప్ గెలుపు సాధ్యం కాదు. సో ఇది జరిగే పనికాదని చెబుతున్నారు. నెవడాలో జో బైడెన్ మొదటి నుంచి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.

మిషిగన్ (16 స్థానాలు), విస్కాన్స్ (10 స్థానాలు) కూడా జో బైడెన్ ఖాతాలోకి వచ్చాయి. మిషిగన్ లో తొలుత ట్రంప్ ఆధిక్యత చూపించినా చివరకు అది బైడెన్ ఖాతాలోనే పడింది. ఇంకా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలైనా, అలస్కా, నెవడా ఫలితాలు రావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తిగా ట్రంప్ పరం అయితే తప్ప ఆయన గెలుపు జరిగే పని కాదు. గెలుపు అవకాశాలు సన్నిగిల్లటంతో ట్రంప్ సుప్రీంకోర్టు బాట పట్టారు. అంతే కాదు పలు రాష్ట్రాల్లో కోర్టులపై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వాటి విశ్వసనీయ ప్రశ్నార్ధంగా ఉందని చెబుతున్నారు. తాజా పరిణామాలు అన్నీ జో బైడెన్ ను వైట్ హౌస్ కు చేరువ చేసినట్లే అని లెక్కలు చెబుతున్నాయి.

Next Story
Share it