Telugu Gateway
Politics

విశాఖ ఉక్కుపై ఢిల్లీకి పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కుపై ఢిల్లీకి పవన్ కళ్యాణ్
X

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై జనసేన స్పందించింది. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బి.జె.పి. జాతీయ అధ్యక్షులు నడ్డా ని కలసి కోరనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమేనని జనసేన భావిస్తోంది.

22 వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది పర్మినెంట్, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సుమారు లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఈ ప్లాంటు ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం అనేది జనసేన అభీష్టానికి వ్యతిరేకం. ఒకసారి ఈ కర్మాగారం చరిత్ర పుటలను తిరగేస్తే ఈ కర్మాగారం ఆవిర్భావం కోసం 32 మంది ప్రాణాలను వదిలారు. వందలాది మంది నిర్భందాలకు గురయ్యారు. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇంతటి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారందరికీ ఆమోదయోగ్యం కాని విషయమే అని పేర్కొన్నారు.

Next Story
Share it