నోరు జారిన ఈటెల
BY Admin19 Jun 2021 12:28 PM

X
Admin19 Jun 2021 12:28 PM
మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ నోరు జారారు. ఇరవై ఏళ్లకుపైగా టీఆర్ఎస్ లో ఉన్న ఆయన తాజాగా కాషాయ జెండా కప్పుకున్న విషయం తెలిసిందే. శనివారం నాడు హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో రేపు జరిగే ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే నాలుక్కరుచుకున్నారు ఈటెల. ఈ సమయంలో ఆయన పక్కన బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సప్ లో వైరల్ గా మారింది.
Next Story