కెసీఆర్ హయాంలో జరిగింది రెండే
ప్రభుత్వ పెద్దలే వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారు
కెటీఆర్ వంద రోజుల ప్రణాళిక ఏమైంది?
దానిపై చెప్పే ఓట్లు అడగాలి
భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలని ప్రణాళిక
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ పాలనలో జరిగింది రెండే అని..అందులో ఒకటి సచివాలయం కూల్చివేత..రెండవది ప్రగతి భవన్ నిర్మాణమే అన్నారు. ప్రభుత్వ పెద్దలే వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ మంత్రి వియ్యంకుడి చేతిలో గుట్కా బిజినెస్ ఉందన్నారు. మరో మంత్రి బంధువు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన సాగుతోందని విమర్శించారు. వరద బీభత్సం ప్రకృతి శాపం కాదు..పరిపాలన వైలఫ్యం అన్నారు. రేవంత్ రెడ్డి సోమవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. కెటీఆర్ అనుచరులే వందల చెరువులను ఆక్రమించుకున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీలో 67 వేల కోట్ల ఖర్చు అన్నది పచ్చి అబద్ధం అని తెలిపారు.
కేవలం ఆరు వేల కోట్ల రూపాయయలు మాత్రమే ఖర్చు పెట్టారని.అందులోనూ కేంద్రం వివిధ పథకాల కింద ఇఛ్చిన నిధులు ఉన్నాయన్నారు. కెటీఆర్ మున్సిపల్ మంత్రి అయ్యాకే నాలాల కబ్జాలు పెరిగాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, వర్థంతిని నిర్వహించని ఏకైక సీఎం కెసీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ పార్కు పక్కన వంద అడుగులపైన అంబేద్కర్ విగ్రహం కడతానని ప్రకటించి కనీసం ఇప్పటివరకూ ఒక్క తట్ట మట్టి తీశారా? అని ప్రశ్నించారు. వందల మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఇప్పటివరకూ అమరవీరుల స్థూపం కూడా కట్టలేదన్నారు. కొన్న వందల సంవత్సరాల క్రితమే నిజాం పాలకులు ఎంతో అభివృద్ధ చేశారన్నారు. టీఆర్ఎస్ వల్లే మెట్రో వ్యయం పెరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెట్రోకు 3500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. హైదరాబాద్ లో అభివృద్ధి కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఎక్కువ జరిగిందని..టీఆర్ఎస్ నగరానికి చేసిందేమీలేదన్నారు. ప్రశ్నించే గొంతులు ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలన్నారు. ప్రజలు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మెట్రో రైలు ఎవరి హయాంలో ప్రారంభం అయిందో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. వందేళ్ళలో జరిగిన అక్రమాలు, కెసీఆర్ ఆరేళ్ళ పాలనలోనే జరిగాయన్నారు. మీడియాలో కాంగ్రెస్ పార్టీకి కొంత అయినా చోటు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. కెసీఆర్, కెటీఆర్, హరీష్ రావు, కవితలకు ఇచ్చే చోటులో కనీసం సగం అన్నా తమకు ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్నించే గొంతులను బతికించాలన్నారు. మున్సిపల్ మంత్రిగా కెటీఆర్ ప్రకటించిన వంద రోజుల వంద రోజుల ప్రణాళిక 1700 రోజులు దాటినా కూడా అందులో ఒక్కటీ అమలు కాలేదన్నారు.