Telugu Gateway
Politics

జగన్ రాష్ట్ర ప్రయోజాలను తాకట్టు పెట్టారు

జగన్ రాష్ట్ర ప్రయోజాలను తాకట్టు పెట్టారు
X

ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు తెలంగాణ, ఏపీల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. దీనిపై ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందం ద్వారా సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. తెలంగాణాలో బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే జగన్ ఇలా చేశారన్నారు. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్టీసీ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

2,65,367 కిలోమీటర్ల బస్సులు నడుపుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ.. 1,04,368 కిలోమీటర్లు కోల్పోవడానికి కారణం ప్రభుత్వ చేతకానితనమేనని ఆరోపించారు. లక్ష కిలోమీటర్లు తగ్గించడంతో ఏపీఎస్‌ ఆర్టీసీ మరింత నష్టపోవడంతో పాటు.. కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని అచ్చెన్నాయుడు ఆందోళన వక్తం చేశారు.

Next Story
Share it