Telugu Gateway
Movie reviews

'జాంబిరెడ్డి' మూవీ రివ్యూ

జాంబిరెడ్డి మూవీ రివ్యూ
X

టాలీవుడ్ లో దయ్యాల సినిమాలు చాలా వచ్చాయి. సక్సెస్ అయ్యాయి. మనకు ఇఫ్పటివరకూ దెయ్యం లాంటి వ్యక్తి మెడ మీద కొరికి రక్తం తాగితే డ్రాక్యులా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్తగా 'జాంబీ'లను తెరపైకి తెచ్చారు. తెలుగులో ఈ జానర్ లో వచ్చిన తొలి సినిమానే ఈ 'జాంబీరెడ్డి'. ఇప్పటివరకూ ప్రశాంత్ వర్మ తీసిన సినిమాలు రెండూ ఆ..!, కల్కిలు విలక్షణ సినిమాలుగా నిలిచాయి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మూడవ సినిమానే ఈ జాంబిరెడ్డి. దెయ్యాల తరహాలో ఉండే ఈ జాంబిలు మామూలు మనుషులు మెడపై కొరికితే వాళ్లు కూడా అలాగే మారిపోతారు. ఏకంగా రెండు గ్రామాల్లోని ప్రజలు అంతా జాంబిలుగా మారిపోతారు. వారి నుంచి హీరో తేజ అండ్ టీమ్ ఎలా తప్పించుకున్నారు..గ్రామస్థులను ఎలా కాపాడారు అన్నదే ఈ సినిమా.

హీరో తేజ సజ్జ ఓ గేమ్ డిజైనర్. ఆయన డిజైన్ చేసిన గేమ్ ఏకంగా మిలియన్ డౌన్ లోడ్లకు చేరువ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్యలు వస్తాయి. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు సాంకేతిక నిపుణుడైన తన స్నేహితుడు హేమంత్ దగ్గరకు వెళతాడు. పెళ్ళి చేసుకోవటానికి హేమంత్ కర్నూలులో ఉండటంతో ఆయనకు దగ్గరకు చేరుకుంటారు ఆ వెళ్లే మార్గమధ్యంలోనే అసలు కథకు భీజం పడుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్..లాక్ డౌన్ వంటి అంశాలను తన సినిమాలో స్పృశించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

దర్శకుడు ఈ హారర్‌ సినిమాకు కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ కథను కర్నూలు నేటివిటీకి కనెక్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్‌. కానీ క్లైమాక్స్‌ మాత్రం తేలిపోయిందనే చెప్పాలి. అప్పటివరకూ సీరియస్ గా తీసుకొచ్చిన సినిమాను జాంబియాలకు మందు అంటూ నీళ్లలో ముంచేసి క్లోజ్ చేస్తాడు. తెలుగు తెరపై జాంబి జానర్ లో ప్రశాంత్ వర్మ చేసిన ప్రయోగం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. అయితే ప్రశాంత్ వర్మ మాత్రం ఓ కొత్త ప్రయోగం చేశారని చెప్పొచ్చు.

రేటింగ్. 2.5/5

Next Story
Share it