ఒకే ఏడాది మూడు సినిమాలు (Mechanic Rocky Movie Review)
విశ్వక్ సేన్ తాను చేసే సినిమాల ఫలితం విషయం పక్కనపెట్టి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ ఒక్క ఏడాదిలోనే ఏ హీరోవి మూడు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి గామి అయితే ...రెండవది గ్యాంగ్స్ అఫ్ గోదావరి. మూడవ సినిమా మెకానిక్ రాకీ ఈ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన విశ్వక్ సేన్ సినిమా లు అన్ని మిశ్రమ స్పందలకే పరిమితం అయ్యాయి. మెకానిక్ రాకీ టైటిల్ తో నే ఈ సినిమాలో హీరో రోల్ ఏంటో చెప్పేశారు. ఒక వైపు తన గ్యారేజ్ కి వచ్చే కార్ల రిపేర్లతో తో పాటు సమాజంలో ఉండే కొన్ని సమస్యలకు కూడా రిపేర్ చేయటానికి ప్రయత్నం చేస్తాడు హీరో ఈ సినిమాలో. కార్ల రిపేర్ తో పాటు డ్రైవింగ్ స్కూల్ కూడా నడుపుతాడు. హీరో విశ్వక్ సేన్ తండ్రి నరేష్ తన గ్యారేజ్ నిర్వహణ ద్వారా వచ్చిన డబ్బుతో దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలనే లక్ష్యంతో పని చేస్తూ ఉంటాడు.
ఇదే సినిమా కథలో కీలక మలుపుకు కారణం అవుతుంది. విశ్వక్ సేన్ కు జోడిగా ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లు నటించారు. తన ఫ్రెండ్ చెల్లి అయిన మీనాక్షి తో నే హీరో ప్రేమలో పడతాడు. మరి శ్రద్ధా శ్రీనాథ్ రోల్ ఏంటి అన్నది సినిమాలో ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మెకానిక్ రాకీ సినిమా చుసిన ప్రేక్షకులు ఎవరు అయినా కూడా ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చూసి మరో సారి విశ్వక్ సేన్ కు దెబ్బపడింది అన్న నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ వరకు ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ గా నడుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లోనే సినిమా అసలు కథ. ఇందులోని ట్విస్ట్ లు మాత్రం ప్రేక్షకులు ఏ మాత్రం ఉహించనవే అని చెప్పొచ్చు. అంత ఆసక్తికరంగా సెకండ్ హాఫ్ కథను నడిపించాడు దర్శకుడు రవి తేజ ముళ్ళపూడి.
సెకండ్ హాఫ్ లో హీరో తన తండ్రి నుంచి వారసత్వం వచ్చిన మెకానిక్ షెడ్ ను రక్షించుకోవటం కోసం...సమస్యల్లో ఉన్న తన ప్రేయసి కష్టాలు తీర్చేందుకు పడే తపన...అందుకు చేసే ప్రయత్నాల సమయంలో విశ్వక్ సేన్ మంచి నటన చూపించాడు. ఈ సినిమాలో అటు మీనాక్షి చౌదరి తో పాటు శ్రద్ధా శ్రీనాధ్ కు కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ డిఫరెంట్ రోల్ లో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తారు. అసలు సినిమా కథను సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేయటం కోసం...ఫస్ట్ హాఫ్ అంతా కూడా రొటీన్ వ్యవహారాలతో నడిపించటంతో ఆ ప్రభావం సినిమాపై పడింది. మెకానిక్ రాకీ లో సునీల్, హర్షవర్ధన్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ హాఫ్ ను ట్రిమ్ చేసి..అందులో కథను ఇంకాస్త బెటర్ గా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే విశ్వక్ సేన్ కు మెకానిక్ రాకీ సూపర్ హిట్ ఇచ్చేది అనే చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ లో దెబ్బపడటంతో ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ సినిమా గా మారిపోయింది.
రేటింగ్ : 2 . 5 /5