టైటిల్ గొప్పగా...సినిమా చప్పగా!(GOAT Movie Review in Telugu)
తమిళ హీరో విజయ్ కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. అయితే గత కొంత కాలంగా విజయ్ సినిమా లు కూడా ట్రాక్ తప్పుతున్నాయి. ఈ గురువారం నాడు భారీ అంచనాల మధ్య విజయ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం (గోట్) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. సినిమా స్టార్టింగ్ స్టార్టింగే భారీ యాక్షన్ సన్నివేశాలతో మొదలుపెడతారు. విజయ్ తో పాటు ఈ సినిమాలో ప్రభు దేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్ లు జయరాం టీం లో పని చేస్తారు. వీళ్ళు అంతా కనీసం ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఉంటూ తమకు అప్పగించిన ఆపరేషన్స్ చక్కబెడతారు. ఒక ఆపరేషన్ లో భాగంగా మాఫియా డాన్ మైక్ మోహన్ ను, ఆయన కుటుంబ సభ్యులను ఈ టీం చంపేస్తుంది. మరో సారి ఒక అసైన్మెంట్ మీద బ్యాంకాక్ వెళ్లిన విజయ్ కొడుకు ఆస్పత్రిలో తప్పిపోతాడు. తప్పిపోయిన కొడుకు ఏమై పోయాడు...తర్వాత కలుసుకున్న తండ్రి, కొడుకుల మధ్య సాగిన ఫైటింగ్ ఏంటి అన్నదే గోట్ సినిమా.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమా ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. అక్కడ అక్కడ యాక్షన్ సన్నివేశాల్లో కొంత పర్వాలేదు అనిపించినా కూడా మొత్తం మీద చూస్తే సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోదు. తండ్రి పాత్ర పోషించిన విజయ్ కు జోడిగా స్నేహ నటిస్తే...యువ విజయ్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటించింది. మీనాక్షి చౌదరి పాత్రకు కు ఈ సినిమా లో పెద్ద ప్రాధాన్యత లేదు అనే చెప్పాలి. సినిమా కథ ...ఇందులోని ట్విస్ట్ లు కూడా ఏ మాత్రం ఆసక్తి కలిగించవు. ఇప్పటికే ఈ తరహా కథలతో కూడిన సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎన్నో సినిమాల్లో చూసినందున ఈ కథలో మలుపులు కూడా ఆకట్టుకోవు. క్లైమాక్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో లింక్ పెట్టి తీసిన ఫైట్ సీన్ కొంత ఒకే అనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ లో కనిపించిన విజయ్ లుక్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. సినిమాకు మాత్రం భారీగా ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం(గోట్) అని పెట్టి ప్రేక్షకులను బకరాలు చేశారు.
రేటింగ్ :2 /5