డీ జె టిల్లు మ్యాజిక్ రిపీట్ అయిందా?!(Tillu Square Movie Review)
అయితే టిల్లు స్క్వేర్ చూసిన తర్వాత నేహా శెట్టి కాకుండా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుని తప్పు చేసారా అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఉండదు అనే చెప్పాలి. ఇందులో ఆమె ఒక వైపు హాట్ గా కనిపిస్తూనే యాక్షన్ సన్నివేశాలు..ట్విస్ట్ ల్లో మంచి నటన కనపర్చింది. డీ జె టిల్లు లో రాధిక ..టిల్లు ను ప్రేమించి మోసం చేస్తే...టిల్లు స్క్వేర్ లో లిల్లీ మోసం చేయటానికే టిల్లు ను ప్రేమిస్తది. టిల్లు 2 లో రాధిక కూడా కొద్ది సేపు మెరుస్తుంది. ఆమె ఎంట్రీ సమయంలో థియేటర్ లు దద్దరిల్లాయనే చెప్పాలి. ఎందుకంటే డీ జె టిల్లు సినిమా లో ఆమె పాత్ర ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించింది. ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెన్త్ ఎంటర్టైన్ మెంట్ మూవీ. అయితే హీరో సిద్దు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ల మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశాల డోస్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇవి మినహాయిస్తే టిల్లు స్క్వేర్ మూవీ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లాయనే చెప్పాలి. దర్శకుడు మల్లిక్ రామ్ డీ జె టిల్లు సినిమా ట్రాక్ ఏ మాత్రం తప్పకుండా టిల్లు స్క్వేర్ ను కొనసాగించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ టార్గెట్ గా తీసిన సినిమా ఇది.దీంతో సిద్దు మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
రేటింగ్ . 3 . 5 /5