రవితేజకు హిట్ దక్కిందా?!
రవి తేజ ఈ సినిమా కోసం ఫుల్ ఎనర్జీ తో కష్టపడి నటించినా కూడా కథ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు ఎక్కడా థ్రిల్ ఫీల్ కారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే పేరు మోసిన దొంగ గా ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు కేవలం తన ఊరి కోసమే అన్ని దొంగతనాలు చేసినట్లు చూపించారు. దొంగల ఊరుగా పేరు ఉండటంతో అక్కడ చదువుకున్న వాళ్లకు కూడా ఎలాంటి ఉద్యోగాలు వచ్చేవి కావు. అందుకే అక్కడ ఒక పొగాకు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టించాలి అని చూడటం..దీనికోసం ఏకంగా ప్రధాని మంత్రి ఇంట్లో దొంగతనం చేస్తానని చెప్పటంతో ఢిల్లీ లోని పోలీస్ ఉన్నతాధికారులు అందరూ ఆంధ్ర ప్రదేశ్ లోని స్టువర్ట్ పురానికి చెందిన టైగర్ నాగేశ్వర్ రావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరి చెప్పినట్లు టైగర్ నాగేశ్వర్ రావు ప్రధానమంత్రి కార్యాలయంలో దొంగతనం చేశాడా...చేస్తే అది ఎందుకు అన్నది వెండి తెరమీదే చూడాలి. ఉండటానికి ఈ సినిమా లో చాలా మంది కీలక నటులు ఉన్న స్టోరీ అంతా నాగేశ్వర్ రావు చుట్టూనే తిరుగుతుంది. అనుపమ్ ఖేర్, మురళి శర్మ, జిష్షు సేన్ గుప్తా, రేణు దేశాయ్ లు ఉన్నారు. హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ల పాత్ర చాలా చాలా పరిమితం. ఇక ఈ సినిమాలో ఫైట్స్ అయితే పది మంది బోయపాటిలు కలిస్తే హింస ఎలా ఉంటుందో అలా ఉంది టైగర్ నాగేశ్వర్ రావు సినిమా పరిస్థితి. బోయపాటి శ్రీను సినిమాలో ఒకరివో ఇద్దరివో తలలు నరుకుతారు..కానీ ఇందులో మాత్రం దర్శకుడు వంశీ అసలు లెక్కలేనన్ని తలలు, కాళ్ళు, చేతులు నరికించి బోయపాటిని మించిపోయాడు అనిపించుకున్నారు. ఒక్కమాటలో టైగర్ నాగేశ్వర్ రావు గురించి చెప్పాలంటే టైటిల్ లో ఉన్న బలం సినిమాలో చూపించటంలో దర్శకుడు విఫలం అయ్యాడు. రవితేజ కష్టానికి ఫలితం లేకుండా పోయింది.
రేటింగ్: 2 .25 -5